పౌరహక్కుల ఉద్యమ ధృవతార – ప్రొ. శేషయ్య జ్ఞాపకాలు – పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, 3Apr. 2024

* * *   హక్కు! ఈ మాట అందరికీ ప్రియమైనది. బడిలో సామాజిక శాస్త్రాన్ని చదివే కంటే ముందే పిల్లలకి కూడా హక్కు గురించి తెలిసి పోతుందేమో! కోరుకున్నదేదైనా వాళ్లు హక్కుగా సాధించేసుకుంటారు.   ఒక దేశ పౌరులుగా ఎలాటి హక్కుల్ని, ఎలాటి బాధ్యతల్ని కలిగి ఉంటామో ఆ దేశపు రాజ్యాంగం చెపుతుంది. పౌరహక్కుల ఉద్యమాన్ని బలంగా నడిపించిన ఒక నాయకుడిని పోగొట్టుకున్న సందర్భంలో ఆయన స్నేహితులు, ఆత్మీయులు, సహచరులు చెప్పిన సంగతుల సమాహారం ఈ పుస్తకం.  వీరంతా శేషయ్యగారితో తమకున్న …

Continue reading పౌరహక్కుల ఉద్యమ ధృవతార – ప్రొ. శేషయ్య జ్ఞాపకాలు – పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, 3Apr. 2024

గలివర్… సాహస సాగర ప్రయాణాలు, పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, 21 Mar. 2024

* * *  మూలంః జొనాథన్ స్విఫ్ట్స్వేచ్ఛానువాదంః కాళ్లకూరి శేషమ్మ జొనాథన్ స్విఫ్ట్ రచనను తెలుగు వారికోసం అనువదించి శేషమ్మ గారు పాఠకులకు ఒక అద్భుత ఊహా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. పిల్లల కోసమే కాదు పెద్దల మనసుల్లోని పసితనాన్ని మరోసారి మేల్కొలిపేందుకు కూడా ఈ కథల్ని అనువదించే పని చేసేరనిపిస్తుంది. జీవితాల్లో దైనందిన ఒత్తిళ్లు, వేగం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ రోజుల్లో సులువుగా వాటిలోంచి బయటపడేసే అందమైన మార్గాన్ని ఇలా కనుక్కున్నారేమో!  ఆధునిక యుగంలో వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు …

Continue reading గలివర్… సాహస సాగర ప్రయాణాలు, పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, 21 Mar. 2024

నేనిలా…తానలా…దీర్ఘకవిత – పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, 11 Mar.2024

* * *  ఈ శీర్షిక చూస్తుంటే ఒక కుతూహలం మన మనసుల్లోకి రాకపోదు. ఎక్కడెక్కడో మాగన్నుగా నిద్రపోతున్న సున్నితమైన భావనలు నెమ్మదిగా ఎవరో తట్టి లేపినట్టు ఉలికిపడి లేస్తాయి. మనసంతా వర్షంలో ఇష్టంగా తడుస్తున్న భావం!  కవి తనకెంతో ప్రియమైన వారి గురించి మురిపెంగా చెప్పుకుంటున్నాడు కాబోలు! పుస్తకంలోకి వెళ్తూనే మన ముఖాలపై నవ్వు పూలు పరుచుకుంటాయి. నిజమే, కవి తన ప్రేమిక గురించే చెపుతున్నాడు. కవి స్వేచ్ఛ ని ప్రశ్నించేదెవరని? అందులోనూ ప్రేమలో పడితే… …

Continue reading నేనిలా…తానలా…దీర్ఘకవిత – పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, 11 Mar.2024

డీకోడింగ్ ద లీడర్ – పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, 1Mar. 2023

* * *  శీర్షిక ఇంగ్లీషులో ఉన్నా ఇది తెలుగు పుస్తకం. తెలుగు రాష్ట్రంలోని ఒక ప్రముఖ వర్తమాన రాజకీయ నాయకుడు గురించి చెప్పిన పుస్తకం. విభజనకు పూర్వం ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి, కొత్తగా విడివడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి పుస్తక కథానాయకుడు. ఆరు సంవత్సరాలు పాటు ఆ నాయకుడితో సన్నిహితంగా పనిచేసిన డా. పెద్ది రామారావుగారు పుస్తక రచయిత. ఒక రాజకీయ నాయకుడి కథే అయినా రాజకీయాలకు, వ్యక్తిగత జీవితానికి …

Continue reading డీకోడింగ్ ద లీడర్ – పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, 1Mar. 2023